Naa Peru Surya Audio Launch Venue Declared

Filmibeat Telugu 2018-04-17

Views 4.3K

Naa Peru Surya audio function on 22 April in Military Madhavaram

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా".ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ఏప్రిల్‌ 22న మిలట్రీ మాధవరంలో ఆడియో ఫంక్షన్ చేయబోతున్నారు. మే 4 న సినిమా ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలానికి చెందిన గ్రామం మాధవరం. బ్రిటీష్ పాలనలోనే ఈ గ్రామం నుంచి అనేక మంది యువత సైన్యంలో ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు.
ప్రతీ ఇంటి నుంచి ఓ వీర సైనికుడిని దేశం కోసం త్యాగం చేసిన కుటుంబాల్ని ప్రత్యక్షంగా కలుసుకునేందుకు నా పేరు సూర్య చిత్రం ఆడియో ఫంక్షన్ మిలట్రీ మాధవరంలో చేయాలని నిర్ణయించాం. ఈనెల 22న ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సైనికుల త్యాగాల్ని మరోసారి గుర్తు చేసుకునేలా... వారిని గౌరవించుకునేలా... ఈ కార్యక్రమం ఉండబోతుంది.
అల్లు అర్జున్ తో పాటు చిత్ర యూనిట్ అంతా ఈ ఆడ‌యో ఫంక్షన్ లో పాల్గొనబోతున్నారు. ఈ ఊరు గురించి తెలుసుకున్న వెంట‌నే మా యూనిట్ అక్క‌డికి వెళ్ళి అక్క‌డ ప్ర‌జ‌ల్ని క‌ల‌వ‌టం జ‌రిగింది. ఆ ఊరు గొప్ప‌ద‌నాన్ని మా యూనిట్ ద్వారా విన్నాము. మ‌నం దేశం భ‌క్తి నేప‌ధ్యంలో తీస్తున్న ఈ చిత్రం కాబ‌ట్టి ఒక్క‌సారి అక్క‌డికి వెళ్ళి రావాల‌ని అంద‌రం అనుకున్నాం. మా హీరో అల్లు అర్జున్ ని చెప్ప‌గానే ఎంతో ఆనందంగా నేను వ‌స్తాను అన‌టం విశేషం.అక్క‌డ కొన్ని కుటుంబాల్నిబ‌న్ని క‌లుసుకుంటారు. వారి స‌మ‌క్షంలొనే ఆడియో ని చెయ్య‌ల‌ని నిర్ణ‌యించుకున్నాము అని అన్నారు.

Share This Video


Download

  
Report form